KDP: ప్రొద్దుటూరులోని చౌటపల్లి YSR విగ్రహం వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో 2 వాహనాలలో తరలిస్తున్న 480 గోవా మద్యం బాటిల్లను శనివారం రాత్రి పట్టుకున్నారు. పామిడి ఆకుల ఇర్ఫాన్ నంది మండలం బాషాలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న 480 బాటిళ్ల విలువ 1.60 లక్షలు, వాహనాల విలువ రూ.7 లక్షలని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.