కృష్ణా: పెందూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ సచివాలయం వద్ద రైతులతో కలిసి సీపీఎం నేతలు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్వోలు సుదర్శన్, స్వప్నకి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి నరసింహరావు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు.