GNTR: నిన్న మబ్బుల వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ, ఈరోజు పశ్చిమ గాలుల ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46°C నుంచి 48°C వరకు, కొన్ని చోట్ల 49°C వరకు నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దన్నారు.