PLD: నరసరావుపేటలో శనివారం( రేపు)సంక్రాంతి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులు, డ్వాక్రా మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి నరసింహారెడ్డి కోరారు. ఆసక్తి గలవారు 87126 22574 నంబరును సంప్రదించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.