NTR: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ డిసెంబర్ 4న జరగనుంది. ఉదయం 5:55కు శ్రీ కామథేను మాత ఆలయం వద్ద ఊరేగింపుగా ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని ఈవో కోరారు.