ATP: మేడాపురం గ్రామానికి చెందిన పలువురు YCP నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరారు. పెద్దన్న, మల్లికార్జున, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పుట్టపర్తి రాజేంద్ర తదితరులను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై విసిగిపోయి అనేక మంది నేతలు టీడీపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.