NLR: ఆత్మకూరు నియోజకవర్గంలో మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఆరు మండలాల పార్టీ నాయకులతో ఆయన చర్చించారు. మే 27, 28వ తేదీల్లో 11 ప్రాంతాల్లో మహానాడు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరవేసి నియోజకవర్గమంతా పసుపుమయం చేయాలని పిలుపునిచ్చారు.