VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ నేపథ్యంలో జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలోభాగంగా గజపతినగరం నియోజకవర్గంలో 60 వేల సంతకాలు సేకరణ జరిగిందని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య చెప్పారు. ఆదివారం గజపతినగరం వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈనెల 10న నియోజకవర్గం స్థాయి, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు జరుగుతాయన్నారు.