ప్రకాశం: మార్కాపురం పలకల పరిశ్రమల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికు కృతజ్ఞతలు తెలుపుతూ.. శనివారం టీడీపీ కార్యాలయంలో పలకల పరిశ్రమల యజమానులు ఆయనను కలిసి ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పలకల పరిశ్రమలపై చొరవ తీసుకొని, ఆదుకోవాలని పరిశ్రమల యజమానులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు యజమానులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.