విశాఖపట్నం ఆటోనగర్‌లోని లోటస్ వైర్లెస్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ KGHకు విరాళం అందించింది. కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా CSRలో భాగంగా రూ.2.80 లక్షల విలువైన మూడు సీటర్ల 40 కుర్చీలు (మొత్తం 120) బుధవారం కింగ్ జార్జి ఆసుపత్రికి విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా.ఐ.వాణి సంస్థ ప్రతినిధులను సత్కరించారు.