ELR: ఈనెల 9వ తేదీన వేలేరుపాడు MPDO కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారని మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ తెలిపారు. పోలవరం MLA చిర్రి బాలరాజు పాల్గొని ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరిస్తారని చెప్పారు. సమస్యను తెలిపేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్ ఇవ్వాలని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.