EG: గోకవరం మండలంలోని కొత్తపల్లి మేజర్ గ్రామపంచాయతీలో రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కలెక్టర్ కీర్తి చేకూరి ఇవాళ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మండలంలోని రైతులు అందరూ ఖరీఫ్ సీజన్లో పండించిన వరి పంటను ఈ కొనుగోలు కేంద్రంలో అమ్ముకుని 48 గంటల్లో నగదు పొందవచ్చునని తెలిపారు.