ATP: బెళుగుప్ప మండలం గంగవరం గ్రామ సమీపంలోని తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో మహిళ సజీవ దహనమైంది. వివరాల మేరకు.. తోటలో నరసన్నకు చెందిన చిన్న పాకలో గంగమ్మ ఒక్కరే నిద్రించారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పాకకు అంటుకున్నాయి. అందులో నిద్రిస్తున్న గంగమ్మ సజీవ దహనం అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.