SKLM: జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నిందితులపై సంబంధిత కోర్టులు చర్యలు తీసుకున్నాయి అని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 28, ఓపెన్ డ్రింకింగ్ కేసులో 19 మందికి జరిమానాలు కోర్టులు విధించినట్లు తెలిపారు. మద్యం త్రాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.