VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. అరుణ్ బాబు మంగళవారం జిల్లాలో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే లక్ష్యంలో భాగంగా ఆయన జిల్లాకు విచ్చేసి, గృహ నిర్మాణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. జిల్లాలో అమలు జరుగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం మరియు హౌసింగ్ కాలనీలను సందర్శించారు.