PPM: కార్తీకమాసం పురస్కరించుకొని మన్యం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటన దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దుర్ఘటనలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.