ELR: జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో జీవించాలని ఆమె సూచించారు. సంఘ వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరిపైనా నిఘా ఉంచుతామని, తక్షణమే మారి సమాజానికి ఉపయోగపడాలని ఏఎస్పీ స్పష్టం చేశారు.