WG: జిల్లాలో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6,770 గృహాలకు 6,600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన 100 గృహల ప్రవేశాలు అన్ని నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపారు.