ప.గో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నేటి నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రైలు నంబర్ 01781 చర్లపల్లి ఈ రోజు రాత్రి 9:30 గంటలకు బయలదేరి 8న రాత్రి 11:50 గంటలకు షాలిమారు చేరుకుంటుంది. తిరిగి చర్లపల్లికి( 01782) 10వ తేదిన సాయంత్రం 4 గంటలకు రానుంది. ఈ ట్రైన్ ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా నడుస్తుంది.