కృష్ణా: గుడివాడ ‘శక్తి టీం’ ఆధ్వర్యంలో బిల్లపాడు గ్రామంలోని గంగాధరపురం ప్రైమరీ స్కూల్లో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ గురించి వివరించారు. తెలియని వ్యక్తుల నుంచి చాక్లెట్లు, బిస్కెట్లు వంటి తినుబండారాలు తీసుకోకూడదని, తల్లిదండ్రులు తప్ప ఇతరులతో స్కూల్ నుంచి ఇంటికి వెళ్లరాదని సూచించారు.