E.G: కడియం మండలం మాధవరాయుడి పాలెం చైతన్య నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి యజ్జల వీర వెంకట విజయ వర్ధన్ కౌశల్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్‌లో ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అన్నదేవుల వీర వెంకట సత్యనారాయణ మంగళవారం విద్యార్థికి సైన్స్ పుస్తకాన్ని మెమొంటో ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.