ATP: ఖైదీల ఎస్కార్ట్, గార్డు డ్యూటీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు సిబ్బందికి అనంతపురంలో మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. ఏఆర్ అదనపు SP ఇలియాస్ బాషా మాట్లాడుతూ.. సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటూ, నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. డ్యూటీలో నిర్లక్ష్యం తగదని, సిబ్బంది స్వీయ భద్రతకు, ఖైదీల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.