SS: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో సందడి నెలకొంది. ఈ వేడుకలకు నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ, నవంబర్ 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరు కానున్నారు. వీరితోపాటు దేశ విదేశాల వీఐపీల పర్యటనల దృష్ట్యా ప్రభుత్వం, ట్రస్టు కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.