GNTR: తెనాలిలో నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా శనివారం ఐటీఐ శిక్షణా కేంద్రంలో నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళా ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. మొత్తం 13 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఒక్కో కంపెనీలో 15 నుండి 20 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.