KDP: రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పులివెందులలోని ఓ స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ దయ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన ధనుష్, సంజయ్, నవీన్‌లు రాష్ట్రస్థాయి హాకీ జట్టుకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి పులివెందుల YSR స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.