నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మంగళవారం MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘స్వర్ణాంధ్ర@2047’ నియోజకవర్గం దార్శనిక కార్యాచరణ ప్రణాళిక (CVAP)కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ద్వారా ప్రజాసేవను వేగంగా అందించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు. పాలనలో పారదర్శకత, వేగం, సమయస్ఫూర్తి వంటి అంశాలు మెరుగుపడతాయని నెల్లూరు ఆర్డీవో అనూష అన్నారు.