NDL: డోన్‌లో అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయాయని శనివారం మాజీ మంత్రి బుగ్గన ఆరోపించారు. YCP హయాంలో వంద పడకల ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లు, DTC, పాలిటెక్నిక్, వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేసినట్లు తెలిపారు. రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి శంకుస్థాపన తర్వాత పనులు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. CBN ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.