KDP: వేంపల్లిలో ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని ఈవో నాగభూషణంరెడ్డి సూచించారు. ఆదివారం తన సిబ్బందితో కలిసి మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశువుల వైద్యాధికారి ధ్రువీకరించిన మాంసాన్ని మాత్రమే విక్రయించాలని దుకాణ యాజమాన్యాలకు సూచించారు.