సత్యసాయి: రొద్దం మండలం మరువపల్లి గ్రామంలో భక్త కనకదాసు జయంతి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. కురుబల కులస్తులు ప్రతి ఇంటి నుండి కలశాలు, కనకదాసు చిత్రపటాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా పాల్గొన్నారు. మంగళవాద్యాల నడుమ జరిగిన ఈ ప్రదర్శన గ్రామాన్ని సందడి చేసింది. అనంతరం కనకదాసు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను జరుపుకున్నారు.