W.G: తణుకు పట్టణ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలోని లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సొంత ఇంటి కల కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.