KRNL: వెల్దుర్తిలో బ్లాక్ మనీ పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.సీ బెళగల్ మండలానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు’ లక్ష ఇస్తే మూడు లక్షల నకిలీ మనీ ఇస్తా’ అని ఆశ చూపి ఓ బాధితుడి నుంచి అసలు నగదు తీసుకొని, నకిలీ నోట్లతో మోసగించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.