NTR: విజయవాడలో మంగళవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 165 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి లెనిన్ బాబు వారికి రూ.18 లక్షల జరిమానా విధించినట్లు సీపీ ఎస్.వీ రాజశేఖర్ బాబు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన కోరారు.