NDL: నల్లమలలో అఖిల భారత పులుల గణన–2026 నేపథ్యంలో అటవీశాఖ ఆంక్షలు విధించింది. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వెంకటాపురం నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అనుమతి ఉంటుందని గురువారం ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు తప్పనిసరిగా తమ సూచనలు పాటించాలని కోరారు.