ATP: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షల జిల్లా పరిశీలకులు, రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఆదివారం ఉదయం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కలెక్టర్ ఆనంద్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పరిశీలకునికి కలెక్టర్ పూల మొక్క అందజేసి సాదర స్వాగతం పలికారు.