SKLM: పాతపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు దాడుల కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు. సెప్టెంబర్ 9న పాతపట్నం పెట్రోల్‌బంక్ దగ్గర శంకర్ రాయితో దాడి చేసి పారిపోయాడు. అక్టోబర్ 26న మామిడిపల్లి ఫంక్షన్లో రామారావు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇద్దరినీ పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు.