ATP: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్ఐ పవన్ కుమార్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఆదర్శనీయమని తెలిపారు.