VZM: స్క్రబ్ టైఫస్ పై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కళ్లు ఎర్రబడటం, దగ్గు, వాంతులు, పొట్టలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలన్నారు.