ATP: జిల్లాలో గత 24 గంటల్లో కొన్ని మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు 167.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 5.2 మిల్లీమీటర్లుగా ఉంది. రాయదుర్గం మండలంలో అత్యధికంగా 52.4 మిల్లీమీటర్ల వర్షం పడగా, డి.హీరేహాల్ 34.0, బొమ్మనహాల్ 25.2, కనేకల్ 19.0, విడపనకల్ మండలంలో 18.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.