GNTR: నగరంపాలెం పరివర్తన భవన్ ఎస్సీ బాలికల వసతిగృహంలో తనిఖీల సందర్భంగా ఓ విద్యార్థిని బ్యాగ్లో గర్భనిర్ధారణ పరీక్ష పరికరం, మంగళసూత్రం బయటపడటం కలకలం రేపింది. కలెక్టర్ తమీమ్ అన్సారియా గత రాత్రి కలక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.