ELR: భీమడోలు-పూళ్ళ రైల్వేస్టేషన్ల మధ్య గల 361 నెంబర్ భీమడోలు రైల్వేగేట్ను ట్రాక్ అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే, ఏలూరు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ తెలిపారు. వివిధ వాహనదారులు, పశువులు పెంపకందారులు, రైతులు, ద్వారకాతిరుమల యాత్రికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.