NTR: ఏపీ టెట్-2025 పరీక్షలు ఈ నెల 10 నుంచి 21 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయని DEO సుబ్బారావు తెలిపారు. విజయవాడ, మైలవరం, తిరువూరులో 7, అలాగే ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెంలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హాల్ టికెట్, ఫొటో గుర్తింపుతో రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు.