NLR: ఉలవపాడు మండలం భీమవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ఎస్టీ కాలనీకి చెందినవాడిగా గుర్తించారు. బంధువుల ఇంటికి వచ్చిన అతను, మద్యం సేవించి బైక్పై వెళ్తూ భీమవరం చెరువు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలవడంతో అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.