కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందిరా నగర్, ఎన్టీఆర్ నగర్, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో లైమ్ పౌడర్ వేసడం,బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి శుభ్రత కార్యక్రమాలను అధికారులు ఇవాళ చేపట్టారు. కాలువలు, డ్రైనేజీలు, రోడ్డు పక్క ప్రాంతాల్లో శుభ్రపరచడం జరిగిందని శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు.