ASR: శీతకాలంలో న్యూమోనియా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ డీ.కృష్ణమూర్తి ప్రజలకు సూచించారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా బుధవారం పాడేరు కలెక్టరేట్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్న పిల్లలు, వృద్ధులలో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.