కడప: కమలాపురం పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, కేసులు సమయానికి పరిష్కరించబడేలా చూడాలని సూచించారు. సీఐ ఎస్.కె. రోషన్, ఎస్సై విద్యాసాగర్ సిబ్బంది కేసుల వివరాలు డీఎస్పీకి అందించారు.