ATP: రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 13న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. పాల్గొనేవారు 11వ తేదీలోపు ఐసీడీఎస్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలి. విజేతలకు మొదటి బహుమతి రూ. 20,000, రెండో బహుమతి రూ.15,000, మూడో బహుమతి రూ.10,000 అందజేస్తారు. 13న ఉదయం 8 గంటలకు పోటీలు మొదలవుతాయి.