సత్యసాయి: సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తిలో విద్యుత్ అంతరాయం లేకుండా రూ. 10 కోట్ల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా SE సంపత్ కుమార్ తెలిపారు. ప్రశాంతి నిలయం, పట్టణ పరిధిలో 35 నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, పాత కండక్టర్ల స్థానంలో కొత్తవి వేయడం, 50 విద్యుత్ స్తంభాలను 11 మీటర్ల ఎత్తుకు పెంచడం వంటి చర్యలు చేపట్టామన్నారు.