VSP: వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో వార్డు కమిటీలు, బూత్ ఏజెంట్ల నిర్మాణంపై ముఖ్య సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కే.కే రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉత్తరలో 80 వేల సంతకాలు సమీకరించినట్లు తెలిపారు. నాయకులు పార్టీ బలోపేతం చేసి, కూటమి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించాలని అన్నారు.