నెల్లూరు జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా 400 మంది రోగులను గుర్తించారు. వీరికి 6 నెలల పాటు అవసరమైన పోషకాహార కిట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించనున్నారు. కోవూరు నియోజకవర్గంలోని 103 మంది రోగులకు 100 శాతం తనవంతు సహాయం చేస్తామని ఎంపీ ప్రకటించారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.