సత్యసాయి: ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభం కానున్న “అటల్–మోడీ సుపరిపాలన యాత్ర”కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను, ముఖ్యంగా హెలిప్యాడ్ స్థలాన్ని నియోజకవర్గ బీజేపీ నేత హరీష్ బాబు గపరిశీలించారు. అధికారులతో సమన్వయం చేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచనలు చేశారు.